: ఈ బట్టలు చెమటను దరిజేరనివ్వవు!


ఏమాత్రం కాస్త కష్టం కలిగినా, లేదా ఏదైనా శారీరక శ్రమ చేసినా వెంటనే మనకు చెమట పట్టేస్తుంది. దీంతో చిరాకు వేస్తుంది. కొందరికి చెమట నుండి దుర్వాసన కూడా వస్తుంది. అయితే మన చెమటను బయటికి పంపేసి, శరీరం ఎప్పుడూ పొడిగా ఉంచే బట్టలను అమెరికాలోని శాస్త్రవేత్తలు రూపొందించారు. సాధారణంగా వేసవి కాలంలో ఎక్కువగా చెమట పడుతుంటుంది. దీంతో ఎక్కువగా కాటన్‌ బట్టలను మనం వేసవి కాలంలో ధరిస్తుంటాం. అయితే ఇవి కూడా చెమటను పీల్చుకొనే విషయంలో ఒక్కోసారి అంతగా పనిచేయవు. చెమటకు తడిసి ముద్దవుతుంటాయి. అయితే ఈ కొత్తరకం బట్టలు మాత్రం అలాకాకుండా ఎప్పుడూ మన శరీరం పొడిగా ఉండేలా చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు సియాన్‌జింగ్‌, జియా జియాంగ్‌లు హైడ్రోఫోలిక్‌ దారాలతో ఒక కొత్తరకం దుస్తులను తయారు చేశారు. ఈ దుస్తులు మన చర్మంలాగే పనిచేస్తాయని, శరీరం నుండి బయటికి వచ్చే చెమటను ఎప్పటికప్పుడు బయటికి పంపేసి మన శరీరాన్ని పొడిగా ఉంచుతాయని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News