: బాంబులను పసిగట్టే తేనెటీగలు!


పేలుడు పదార్థాలను పసిగట్టే జాగిలాల గురించి మనకు తెలిసిందే. అయితే, శునకాలే కాదు, తేనెటీగలు కూడా మందుపాతరలను, బాంబులను గుర్తిస్తాయని ఓ అధ్యయనం వెల్లడిస్తోంది. క్రొయేషియా శాస్త్రజ్ఞులు ఈ విషయమై ప్రస్తుతం పరిశోధనలు నిర్వహిస్తున్నారు. విస్ఫోటక పదార్థాలను కనుగొనడంలో తేనెటీగలకు శిక్షణ ఇవ్వడం ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చని వారు విశ్వసిస్తున్నారు.

జాగ్రెబ్ యూనివర్శిటీ నిర్వహిస్తోన్న ఈ ప్రాజెక్టుకు 'తిరమిసు' అని నామకరణం చేశారు. పరిశోధనలో భాగంగా తేనెటీగలు.. పేలుడు స్వభావం కలిగిన ట్రై నైట్రో టయలిన్ (టీఎన్ టీ) పదార్ధం వాసనను పసిగట్టాల్సి ఉంటుంది. అది ఎలాగో వారు వివరిస్తున్నారు. విస్ఫోటక పదార్థాన్ని చక్కెరతో కలిపి తేనెటీగలకు వాసన చూపిస్తే సరి అంటున్నారు. మూడు మైళ్ళ దూరంలో ఉన్నా, సదరు పేలుడు పదార్థాన్ని భూమిలో పాతినా సరే పసిగట్టేస్తాయట. కుక్కల కంటే అధిక ఆఘ్రాణ శక్తి కలిగి ఉండడం తేనెటీగలకు ఓ వరమని తాజా అధ్యయనంలో పాల్గొంటున్న ప్రొఫెసన్ మాటెజే జేన్స్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News