: ప్రధాని అభ్యర్థిని తర్వాత ప్రకటిస్తాం: బీజేపీ
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు గాను తమ ప్రధాని అభ్యర్థిని తర్వాత ప్రకటిస్తామని భారతీయ జనతా పార్టీ వెల్లడించింది. 2014 ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు బీజేపీ నేడు ఢిల్లీలో పార్లమెంటరీ బోర్డు సమావేశం నిర్ణయించింది. ఈ భేటీలో ఆ పార్టీ అగ్రనేతలు పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, అగ్రనేత అద్వానీ, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ, పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ తదిరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. భేటీ అనంతరం రాజ్ నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఇక ప్రధాని అభ్యర్థి ఎవరన్న విషయమై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించేందుకు ఏ ఒక్క అవకాశాన్నీ జారవిడుచుకోబోమని స్పష్టం చేశారు.