: కోర్టులకు వేసవి సెలవులు ఎందుకు?: మద్రాస్ హైకోర్టులో వ్యాజ్యం
కోర్టు భవనాలు, న్యాయమూర్తుల చాంబర్లు, వారి కార్లూ అన్నీ ఎయిర్ కండిషన్డే అయినప్పుడు.. కోర్టులకు వేసవి సెలవులు ఎందుకని ప్రశ్నిస్తున్నాడో న్యాయవాది. ఈమేరకు మద్రాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. వేలకొద్దీ కేసులతో న్యాయస్థానాలు కుస్తీలు పడుతుండగా.. బ్రిటీష్ శకం నాటి కాలం చెల్లిన విధానాలను ఇంకా విడనాడలేకపోతున్నారని విమర్శించారు. ఇక మద్రాస్ హైకోర్టుకు మే 1 నుంచి జూన్ 2 వరకు వేసవి సెలవులు ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. అప్పట్లో బ్రిటీష్ న్యాయమూర్తులు భారత్ లో ఎండలకు తాళలేకపోవడంతో వేసవి కాలాన్ని కోర్టులకు విరామంగా ప్రకటించేవారని, ఆ పద్ధతిని ఇంకా అమలు చేయడం దారుణమని సదరు న్యాయవాది ఆవేదన వ్యక్తం చేశారు.