: 'ఉపాధి' అక్రమాలపై విచారణ జరపాలి: సోనియాగాంధీ
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అక్రమాలపై సాక్షాత్తూ యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ గళమెత్తారు. ఈ పథకంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు. దేశంలో రెండో హరిత విప్లవంలో ఈ పథకం క్రియాశీల పాత్ర పోషిస్తుందని ఆమె చెప్పారు. మహిళా కూలీలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా పని కల్పిస్తామని హామీ ఇచ్చారు.
డిల్లీలో ఈ ఉదయం జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా ప్రసంగించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామీణుల్లో ఆర్థిక చైతన్యం తీసుకువస్తోందని ప్రధాని అన్నారు. ఇప్పటికే వారిలో చెప్పుకోదగిన మార్పు వచ్చిందని తెలిపారు. దీని ద్వారా ఇప్పటి వరకు 8 కోట్ల మందికి ఉపాధి కల్పించామని చెప్పారు. పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన పథకాల్లో ఇదే అతి పెద్దదని పేర్కొన్నారు.