: యూపీఏ విందు రాజకీయం షురూ
యూపీఏ ప్రభుత్వం విందు రాజకీయాలకు తెరతీసింది. 2014 ఎన్నికలకు ముందస్తు సన్నాహాల్లో భాగంగా ప్రజలను ఆకట్టుకునేందుకు 200 వందల కోట్ల బడ్జెట్టును ప్రచార ప్రకటనల కోసం కేటాయించిన యూపీఏ ప్రభుత్వం దృష్టి తాజాగా మిత్రపక్షాలపై పడింది. మిత్రులను ఆకట్టుకునేందుకు విందుభోజనం పెట్టేందుకు నిర్ణయించారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు. దీంతో హుటా హుటిన వారిని విందుతో పసందు చేసేందుకు ప్రణాళిక రచించారు. ఈ విందు పార్టీకి ఎస్పీ, బీఎస్పీ, డీఎంకే వంటి పార్టీలకు ఆహ్వానం పంపారు. కాగా, మరో వైపు దీదీకి కూడా ఆహ్వానం పంపినట్టు సమాచారం. దీంతో రానున్న ఎన్నికల్లో అటూ ఇటు అయినా పెద్దగా ముప్పులేకుండా ముందుగానే విందు ఏర్పాటు చేసి వారిని ఆకట్టుకుంటున్నారు.