: ఫిక్సింగ్ వ్యవహారంలో బాలీవుడ్ నటుడి అరెస్టు


స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు క్రికెటర్లతో పాటు పెద్ధ సంఖ్యలో బుకీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరింత లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. ఈ క్రమంలో ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు దారా సింగ్ కుమారుడు విందూ సింగ్ ను ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. విందూ సింగ్ పలు భాషల చిత్రాల్లో నటించారు. తాజా ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఘటన నేపథ్యంలో ఈయనకు బుకీలతో సంబంధాలున్నట్టు క్రైమ్ బ్రాంచ్ అనుమానిస్తోంది. విందూ సింగ్ తాజా సీజన్ లో కొన్ని ఐపీఎల్ మ్యాచ్ లను టీమిండియా కెప్టెన్ ధోనీ భార్య సాక్షితో కలిసి వీక్షించడం పలు సందేహాలకు తావిస్తోంది.

  • Loading...

More Telugu News