: రాజీవ్ గాంధీ బతికుంటేనా..దేశం దూసుకెళ్ళేది: సీఎం కిరణ్
దివంగత ప్రధాని రాజీవ్ గాంధీపై రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన అభిమానాన్ని చాటుకున్నారు. నేడు రాజీవ్ 22వ వర్థంతి సందర్బంగా గాంధీ భవన్ లో ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన కిరణ్.. రాజీవ్ మరికొంతకాలం బతికుంటే, భారత్ పురోగామి పథంలో దూసుకెళ్ళేదని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో అగ్రరాజ్యాలను సైతం అవలీలగా అధిగమించేదని చెప్పుకొచ్చారు. దేశంలో సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవే అన్న సీఎం.. ఆయన నిర్ణయాలు చరిత్రను తిరగరాశాయని కితాబిచ్చారు.