: నేనూ లైంగిక వేధింపులకు గురయ్యా: అనౌష్కా శంకర్
బాల్యంలో తాను సైతం లైంగిక వేధింపులకు గురయ్యానని దివంగత సంగీత విద్వాంసుడు పండిట్ రవి శంకర్ తనయ అనౌష్క వెల్లడించారు. తనను లైంగికంగా హింసించిన ఆ వ్యక్తి తన తల్లిదండ్రులకు నమ్మకస్తుడు కావడంతో నిస్సహాయురాలిగా ఉండిపోయానని ఆమె గుర్తు చేసుకున్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటివి సహించరాదని, ఆత్మస్థైర్యంతో పోరాడాలని ఆమె యువతకు ఉద్భోదించారు. స్త్రీలపై దాడులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో అనౌష్క కూడా పాల్గొంటోంది. ఈ సందర్భంగా ఓ వీడియో లో తన అనుభవాలను పంచుకుంది.