: ఆరుషి తల్లిదండ్రులకు హైకోర్టులోనూ చుక్కెదురే..


టీనేజర్ ఆరుషి హత్య కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె తల్లిదండ్రులు రాజేశ్ తల్వార్, నూపుర్ తల్వార్ లకు అలహాబాద్ హైకోర్టులోనూ చుక్కెదురైంది. ఇంతకుముందు, ఈ కేసులో 14 మంది సాక్ష్యులను మరోసారి విచారించాలంటూ తల్వార్ దంపతులు సుప్రీంని ఆశ్రయించి, చీవాట్లు తిన్న సంగతి తెలిసిందే. సీబీఐ కోర్టు ఉత్తర్వులను హైకోర్టులో సవాల్ చేయకుండా, నేరుగా తమవద్దకు రావడాన్ని అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. దీంతో, రాజేశ్ తల్వార్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను నేడు విచారించిన న్యాయస్థానం తల్వార్ దంపతుల విన్నపాన్ని తోసిపుచ్చింది. కాగా, తల్వార్ దంపతుల వాంగ్మూలాన్ని రికార్డు చేసిన సీబీఐ కోర్టు గత రెండ్రోజులుగా వారిని నిశితంగా ప్రశ్నిస్తోంది.

  • Loading...

More Telugu News