: డాక్టరేట్ నా తండ్రికి అంకితం: అలీ
తాజాగా పుట్టిన రోజు జరుపుకున్న ప్రముఖ హాస్య నటుడు అలీ తనకు 'అకాడమీ ఆఫ్ యూనివర్సల్ పీస్' డాక్టరేట్ ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేసారు. డాక్టరేట్ వచ్చిందని తెలియగానే ఎంతో థ్రిల్ కు గురయ్యానన్న ఆయన తన పేరుముందు డాక్టర్ అని చేర్చుకునేందుకు ఎంతగానో ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. తనకు ఇంతటి గౌరవం తన తండ్రి వల్లేదక్కిందన్న అలీ ఈ పురస్కారాన్ని ఆయనకే అంకితమిస్తున్నట్టు తెలిపారు. ఈ పురస్కారాన్ని ఈ నెల 25న కోయంబత్తూరు యూనివర్సిటీ స్నాతకోత్సవంలో అందజేయనున్నారు.