: సీబీఐ జేడీ లక్ష్మీనారాయణను కలవనున్న రఘునందన్


టీఆర్ఎస్ బహిష్క్రతనేత రఘునందనరావు మరి కాసేపట్లో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణను కలవనున్నారు. సిద్దిపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై చేసిన ఆరోపణలకు సంబంధించి ఆయన సీబీఐకి ఫిర్యాదు చేయనున్నారు. హరీష్ తో పాటూ మరికొంతమంది టీఆర్ఎస్ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆయన, తనవద్ద ఉన్న ఆధారాలను సీబీఐకి ఇచ్చే అవకాశం ఉంది.

రఘునందనరావు ఆరోపణలపై తొలుత స్పందించని టీఆర్ఎస్ నేతలు ఒక్కక్కరుగా స్పందించడం మొదలు పెట్టారు. హరీష్ రావు అవినీతికి పాల్పడలేదని సంజాయిషీ చెప్పుకున్నా, తొలి మూడు రోజులు స్పందించని టీఆర్ఎస్ శ్రేణులు పార్టీ పరువు పోతుందని ఈటెల రాజేందర్ తో సమాధానం చెప్పించారు. మీడియాలో హరీష్ కి, కేటీఆర్ కి పొసగడం లేదన్న వరుస వార్తా కధనాలతో స్పందించిన కేటీఆర్ తమ మధ్య వివాదాలేవీ లేవని తూతూ మంత్రంగా చెప్పేసారు. కానీ తనను ఓడించేందుకు ప్రత్యర్థికి డబ్బు ముట్టజెప్పారన్న వార్తలపై మాత్రం స్పందించలేదు. తాజాగా విజయశాంతి కూడా ఆధారాలు బయటపెట్టాలని సూచించారు.

మరో వైపు రఘునందన్ తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ డీజీపీ దినేష్ రెడ్డిని కలిశారు. తమకు భద్రత కల్పించాలని, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదు చేసారు. ఇప్పటికే లీగల్ గా తనను ఎందుకు సస్పెండ్ చేసారో సమాధానమివ్వాలంటూ టీఆర్ఎస్ భవన్ కు నోటీసులు పంపించారు. తాజాగా సీబీఐ జేడీ లక్ష్మీనారాయణను కలిసి తనదగ్గరున్న ఆధారాలు ఇవ్వనున్నారు.

  • Loading...

More Telugu News