: వీరప్పన్ అనుచరులకు త్వరలో ఉరి?


గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ నలుగురు అనుచరులను త్వరలోనే ఉరి తీయనున్నారు. వీరి క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం తిరస్కరించారు. 1993లో మందుపాతర పేలి  22 మంది పోలీసులు మృతి చెందిన  సంఘటనలో ఈ నలుగురిని అప్పట్లో దోషులుగా నిర్ధారించి, తీవ్రవాద వ్యతిరేక  న్యాయస్థానం జీవిత ఖైదు విధించగా, ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో వారికి ఉరి శిక్షను ఖరారు చేసింది. తాజాగా రాష్ట్రపతి వీరి అభ్యర్థనను తోసిపుచ్చడంతో కర్నాటకలోని బెల్గాం జైల్లో ఈ నలుగురికి మరణ శిక్ష అమలు చేయనున్నారు. ఈ మేరకు వీరి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News