: రాజీవ్ గాంధీకి ఘన నివాళి
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి అటు ఢిల్లీలోనూ, ఇటు రాష్ట్రంలోనూ నేతలు ఘనంగా నివాళి అర్పించారు. 22వ వర్థంతి సందర్భంగా ఢిల్లీలోని రాజీవ్ సమాధి వద్ద రాష్ట్రపతి ప్రణబ్, ఉపరాష్ట్రపతి అన్సారీ, ప్రధాని మన్మోహన్ సింగ్, రాజీవ్ సతీమణి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, రాబర్ట్ వాద్రా తదితరులు పుష్పగుచ్చాలు ఉంచి నివాళి అర్పించారు.
మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యన్నారాయణ తదితరులు ఈ ఉదయం హైదరాబాద్, సోమాజీగూడ సర్కిల్ వద్ద రాజీవ్ విగ్రహానికి పూలమాలవేసి అంజలి ఘటించారు. గాంధీ భవన్ లోనూ పలువురు నివాళి అర్పించారు.