: అమితాబ్ పెట్టుబడులపై లాభాల వర్షం
అమితాబ్ కు లక్ తిరిగినట్లుంది. కాసుల వర్షం కురుస్తోంది. దేశీయ సెర్చ్ ఇంజిన్ జస్ట్ డయల్ కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. ఈ కంపెనీలో బిగ్ బీకి 63,000 షేర్లున్నాయి. వాటి విలువ ఇప్పుడు 3.4కోట్ల రూపాయలు. కానీ, 2011 ఫిబ్రవరిలో ఇవే షేర్లను జస్ట్ డయల్ కంపెనీ అమితాబ్ బచ్చన్ కు ముఖ విలువ అయిన 10 రూపాయల చొప్పునే కేటాయించింది. అంటే అప్పుడు ఆయన పెట్టిన పెట్టుబడి 6.3లక్షలు రూపాయలు మాత్రమే. రెండేళ్లలో అవి కాస్తా కోట్లుగా మారాయి. అమితాబ్ జస్ట్ డయల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. అంబాసిడర్ కదాని కంపెనీ అమితాబ్ కు ముఖవిలువకే షేర్లను కేటాయించడం కలిసి వచ్చింది.