: రేపటి నుంచి ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు


ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రధాన పరీక్షలు ఈ నెల 28తో ముగుస్తాయి. ప్రధమ, ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తం 10,13,640 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. వీరిలో ప్రధమ సంవత్సరం 6,89,274 మంది విద్యార్థులు రాయనుండగా, ద్వితీయ సంవత్సరం పరీక్షలు 3,24,366 మంది విద్యార్థులు రాయనున్నారు. వీరిలో ఇంటర్ ప్రధమ సంవత్సరం నుంచి ఇంప్రూవ్ మెంట్ క్రింద 3,29,779 మంది పరీక్షలు రాయబోతుండడం గమనార్హం. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 31 నుంచి జూన్ 6 వరకూ ప్రాక్టికల్స్ జరుగనున్నాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు.

  • Loading...

More Telugu News