: మన జీవనాన్ని నడిపే జన్యువు


మన మెలకువ, నిద్రలను ఒక జన్యువు శాసిస్తోందని ఒక పరిశోధక బృందం కనుగొంది. మన శరీరంలోని ఈ జన్యువే మన జీవగడియారాన్ని నడిపిస్తోందని తాము జరిపిన తాజా పరిశోధనలో తేలిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత సంతతికి చెందిన న్యూరో బయాలజీ ప్రొఫెసర్‌ రవి అల్లాడ నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధనలో 'అటాక్సిన్‌ 2' అనే జన్యువు మన నిద్ర, మెలకువలను శాసిస్తోందని కనుగొన్నారు.

డ్రోసోఫిలా మెలనోగ్యాస్టర్‌ (పండ్లమీద వాలే ఒకరకమైన ఈగ) లోని జీవన గడియారం మన జీవన గడియారాన్ని పోలివుంటుంది. దానిలోని 'అటాక్సిన్‌ 2'ను తొలగించగానే దాని నిద్ర, మెలకువ లయ విచ్ఛిన్నమైందని ప్రొఫెసర్‌ రవి తెలిపారు. శరీరంలోని ఈ జన్యువు ప్రతికూలంగా పరివర్తన చెందితే మన మాటలు, చేతలు, చూపులకు మధ్య సమన్వయం నశించే 'స్పైనో సెరిబెల్లార్‌ అటాక్సియా' (ఎస్‌సీఏ) అనే అరుదైన వ్యాధి వస్తుందని, ఇదే జన్యువు లోపించడం వల్ల కాళ్లూ, చేతులు చిన్న చిన్న పనులకు కూడా సహకరించని కండర క్షీణత వ్యాధి 'ఎమిట్రోఫిక్‌ లేటరల్‌ స్కెర్లోసిస్‌'కు కూడా కారణమవుతోందని రవి అంటున్నారు.

  • Loading...

More Telugu News