: 'మాయ' చేసిన 1400 కోట్లు


బీఎస్పీ అధినేత్రి మాయావతిని ఉత్తరప్రదేశ్ లోకాయుక్త తప్పుపట్టింది. యూపీలో విగ్రహాలు నెలకొల్పేందుకు మంత్రులు, అధికారులు పలువురితో కలిసి 1400 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసారని లక్నో లోకాయుక్త తేల్చి చెప్పింది. మాయావతి హయాంలో జరిగిన అక్రమాలపై దాదాపు ఏడాది పాటు దర్యాప్తు చేసిన లోకాయుక్త ఈ నిజాలను బయటపెట్టింది. బీఎస్పీ మంత్రులు నసీముద్దీన్ సిద్దిఖీ, బాబుసింగ్ కుష్వాహలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా లోకాయుక్త జస్టిస్ ఎన్ కే మోహ్రోత్రా సిఫారసు చేసారు. వారిద్దరి నుంచి 30 శాతం డబ్బుని వసూలు చేయాలని సూచించారు. మరో 17 మందిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని లోకాయుక్త సూచించింది.

  • Loading...

More Telugu News