: ట్రాన్స్ కో ఆధ్వర్యంలో సౌరవిద్యుత్ పై అవగాహన


సౌరవిద్యుత్ పరికరాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఏపీ ట్రాన్స్ కో భారీ ప్రదర్శన నిర్వహించనుంది. హైదరాబాద్ లో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి మృత్యుంజయ సాహు ఈమేరకు సోమవారం నిర్ణయం తీసుకున్నారు. గృహోపకరణాలు మొదలు సౌరవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు వరకూ అవసరమైన పరికరాలను ప్రజలకు పరిచయం చేయటానికి ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఫ్యాప్సీ, ఫిక్కీ వంటి సంస్థలతో ట్రాన్స్ కో అధికారులు సంప్రదింపులు మొదలుపెట్టారు. సంప్రదాయ ఇంధన వాడకం తగ్గించడంతో పాటూ విద్యుత్ పొదుపును కూడా సూచించేలా వారం రోజుల పాటు ఈ ప్రదర్శన నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News