: బీసీసీఐ చీఫ్ పై పోలీసులకు ఫిర్యాదు
క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతాన్ని ఫ్యాన్స్ సీరియస్ గా తీసుకున్నట్టున్నారు. ఈరోజు చెన్నైలో రామచంద్రన్ అనే క్రికెట్ అభిమాని బీసీసీఐ చీఫ్ ఎన్. శ్రీనివాసన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిక్సింగ్ అంశంపై శ్రీనివాసన్ చేసిన వ్యాఖ్యలు బెట్టింగ్ ను ప్రోత్సహించే విధంగా ఉన్నాయని రామచంద్రన్ పేర్కొన్నారు. అంతేగాకుండా, ఫిక్సింగ్ కు పాల్పడిన రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్ళు శాంతకుమరన్ శ్రీశాంత్, అజిత్ చండీలా, అజిత్ చవాన్ లపైనా ఈ చెన్నై అభిమాని ఫిర్యాదు చేశారు. ఫిక్సింగ్ వ్యవహారంపై నిన్న బీసీసీఐ కార్యవర్గ సమావేశం నిర్వహించిన శ్రీనివాసన్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాము బెట్టింగ్ అరికట్టడంలో నిస్సహాయులమని నైరాశ్యం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.