: పాత్రికేయ వృత్తిని దిగజార్చవద్దు: రేవంత్ రెడ్డి
చిల్లర పనులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు పాత్రికేయ వృత్తిని దిగజార్చవద్దని టీడీపీ నేత రేవంత్ రెడ్డి సూచించారు. జర్నలిస్టుల ముసుగులో వారు తమపై దాడులకు దిగుతూ వృత్తిని అగౌరవపరుస్తున్నారన్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
గుంటూరులో బాబు పాదయాత్ర చేస్తున్న సమయంలో కాన్వాయ్ పై సాక్షి కార్యాలయం నుంచి కోడిగుడ్లు విసిరి, సమర్థించుకున్న విధానాన్ని ఆయన తప్పుబట్టారు. వృత్తిని అడ్డం పెట్టుకొని ఆ పార్టీ రాజకీయం చేస్తోందని ఎద్దేవా చేశారు. ఓ రౌడీషీటర్ మనవడే వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్న విషయాన్ని పార్టీ నేతలు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు.