: శ్రీశాంత్ కు మరాఠీ నటితో లింకేంటి?
స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలో ముంబయిలోని హోటల్ గది నుంచి స్వాధీనం చేసుకున్న శ్రీశాంత్ లాప్ టాప్ ను ఓపెన్ చేసి చూడగా పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఈ కేరళ క్రికెటర్ ఈ-మెయిల్ ఐడీకి ఓ సినీ డైరక్టర్ పెద్ద సంఖ్యలో మోడళ్ళ ఫొటోలు పంపినట్టు తెలిసింది. అంతేగాకుండా, ఓ మరాఠీ నటితోనూ శ్రీశాంత్ కు సన్నిహిత సంబంధాలున్నట్టు పలు ఆధారాలు లభ్యమయ్యాయని సమాచారం. కాగా, ఈరోజు జరిపిన సోదాల్లో ఫిక్సింగ్ నిందితుడు చండీలా బంధువుల ఇంట్లో రూ.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.