: వైఎస్ విచ్చల విడిగా అవినీతికి పాల్పడ్డారు: బాబు


రాష్ట్రంలో కళంకిత మంత్రులను తక్షణమే తొలగించాలని రాష్ట్రపతిని కోరినట్టు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రపతిని కలిసిన అనతరం బాబు మీడియాతో మాట్లాడారు. వైఎస్ హయాంలో అవినీతి విచ్చలవిడిగా జరిగిందని ఆరోపించిన బాబు, వైఎస్ చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులన్నింట్లోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయన్నారు. గనులు, ఖనిజ సంపదను ఎస్ ఈజడ్ ల పేరుతో ఆక్రమించుకున్నారని మండిపడ్డారు. నీకది-నాకిది పద్దతిన వైఎస్ బ్యాచ్ పలు అక్రమాలకు పాల్పడ్డారన్న బాబు, సుమారు 43 వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. సీపీఐ, టీఆర్ఎస్, టీడీపీ సంయుక్తంగా ప్రచురించిన రాజా ఆఫ్ కరెప్షన్, మైనింగ్ మాఫియా వంటి పుస్తకాలను రాష్ట్రపతికి అందజేసారు. వాటన్నింటినీ సరిచేసుకునేందుకు మంత్రులను తొలగించాలని కోరినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News