: అట్లాంటి ఇట్లాంటి లక్కు కాదు...!


తంతే బూరెల గంపలో పడ్డట్టు బిల్లులు కొండంత పేరుకుపోయి... అప్పులు తీర్చలేక... కనీసం అద్దెకూడా కట్టలేక ఇల్లు ఖాళీ చేద్దామనుకున్నాడు అమెరికాలోని ఇల్లినాయిస్ లో ఉంటున్న రికార్డో సెరిజో. అప్పుల బాధ భరించలేక ఇల్లు ఖాళీ చేసేందుకు సిద్దమౌతూ, వంటగది శుభ్రం చేస్తుండగా ఓ సీసా అతని భార్య చూసింది. అందులో లాటరీ టికెట్లుండడంతో వాటిని అతనికిచ్చింది. నెలరోజుల క్రితం కొన్న టికెట్లు పారేద్దామనుకుంటూ సరదాగా చూసిన ఆయనకు మూర్ఛ వచ్చినంత పనయ్యింది. ముందు 8 టికెట్ల వరకూ రాని లక్కు తొమ్మిదో టికెట్టుతో అతని సొంతమయ్యింది. దీంతో లాటరీ సంస్థ దగ్గరకు వెళ్ళి వాకబు చేయగా 25 కోట్ల బహుమతి వచ్చిందని చెప్పారు. దీంతో కష్టాలన్నీ దేవుడే తీర్చాడంటూ పండగ చేసుకుంటున్నాడు రికార్డో సెరిజో.

  • Loading...

More Telugu News