Raghuveera Reddy: మెగాస్టార్ చిరంజీవిని కలిసిన రఘువీరారెడ్డి

  • కుటుంబ సభ్యులతో కలిసి చిరంజీవి నివాసానికి వెళ్లిన రఘువీరా
  • నీలకంఠాపురంలో ఆంజనేయ విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా ఆహ్వానం
  • మే 29న విగ్రహావిష్కరణ
Former PCC chief Raghuveera Reddy invites Chiranjeevi

ఏపీ పీసీసీ మాజీ చీఫ్ రఘువీరారెడ్డి మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి చిరంజీవి నివాసానికి వెళ్లారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో నూతనంగా నిర్మించిన 52 అడుగుల పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా చిరంజీవిని రఘువీరారెడ్డి ఆహ్వానించారు. విగ్రహావిష్కరణ మే 29న జరగనుంది. కాగా, నీలకంఠాపురంలోని నీలకంఠేశ్వరస్వామి ఆలయ కమిటీకి రఘువీరారెడ్డి చైర్మన్ గా ఉన్నారు.

More Telugu News