Jagan: సీఎం హోదాలో రెండోసారి పోలవరం ప్రాజెక్ట్ సందర్శించిన జగన్
- జగన్కు స్వాగతం పలికిన పలువురు మంత్రులు
- ఏరియల్ సర్వే ద్వారా పోలవరం ప్రాజెక్ట్ సందర్శన
- కాసేపట్లో ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష
సీఎం హోదాలో జగన్ ఏరియల్ సర్వే ద్వారా రెండోసారి పోలవరం ప్రాజెక్ట్ను సందర్శించారు. కాసేపట్లో ఆయన ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు. ఈ రోజు ఉదయం పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న జగన్కు హెలిప్యాడ్ వద్ద ఏపీ మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, ఆళ్ల నాని, తానేటి వనిత, చెరుకువాడ శ్రీరంగనాథ రాజుతో పాటు పలువురు స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయడానికి రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, గడువులోగా పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులకు జగన్ సూచిస్తున్నారు. కాసేపట్లో సమీక్ష సమావేశం ప్రారంభం కానుంది.