: దేశంలోనే తొలి ఢిఫెన్స్ యూనివర్సిటీ
దేశంలో రక్షణ విద్య, పరిశోధన మరింత కొత్త పుంతలు తొక్కనుంది. దేశంలోనే తొలిసారిగా 'ఇండియన్ నేషనల్ ఢిఫెన్స్ యూనివర్సిటీ'ని ఢిల్లీకి సమీపంలో గుర్గాన్ లో ఏర్పాటు చేస్తున్నారు. బినోలా గ్రామంలో 200 ఎకరాలలో ఏర్పాటు చేయనున్న ఈ యూనివర్సిటీ నిర్మాణానికి ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ నెల 23న శంకుస్థాపన చేస్తారు. రక్షణ రంగానికి సంబంధించిన విద్య, శిక్షణ, పరిశోధన కోర్సులను ఇక్కడ అందిస్తారు.