: బొత్సపై వర్ల రామయ్య తీవ్ర విమర్శలు
టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలపై తీవ్ర విమర్శలు చేశారు. 'లిక్కర్ డాన్' అయిన బొత్సకు పీసీసీ పదవి, మంత్రి పదవి, కిరణ్ కు సీఎం పదవి కట్టబెడితే ఒకరిపై ఒకరు ఎదురుదాడులు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు.
సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టు అయిన బండ్ల గణేష్ బడా నిర్మాత కావటం వెనుక ఎవరి హస్తం ఉందని ప్రశ్నించారు. బొత్సనే కోట్ల రూపాయలతో సినిమాలు తీయిస్తున్నారన్నారు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించిన ఆయన, అది ప్రజల డబ్బు కాదా? అని నిలదీశారు.