: సన్ రైజర్స్ టైటిల్ విజేతవుతుందా?
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వెలిగిపోతోంది. తొలి సీజన్ లో అడుగుపెట్టిన హైదరాబాద్ జట్టు చివరి లీగ్ మ్యాచ్ లో దుమ్మురేపింది. కోల్ కతా తో జరిగిన పోరులో బంతితో విజ్రుంభించిన హైదరాబాద్ తరువాత బ్యాట్ తో చెలరేగి నాకౌట్ కు అర్హత సాధించింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన లీగ్ దశ చివరి మ్యాచ్ లో అన్ని రంగాల్లో రాణించింది. దీంతో మరో రెండు మ్యాచ్ లలో గెలిస్తే హైదరాబాద్ జట్టుకు ఫైనల్ బెర్తు ఖాయం.
నాకౌట్ దశ తొలి మ్యాచ్ లో 22న రాజస్థాన్ రాయల్స్ తో యుద్థానికి సిద్దమౌతోంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే తరువాత తొలి రెండు స్థానాల పోటీలో ఓడిన జట్టుతో తలపడుతుంది. ప్రస్తుతం సన్ రైజర్స్ జోరు చూస్తుంటే టైటిల్ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇంత వరకూ హోంగ్రౌండ్ లో హైదరాబాద్ ఓటమి పాలవ్వలేదని, ఇక నుంచి జరిగేవన్నీ స్థానికేతర మైదానాల్లోనే జరుగుతాయి. మరి, సన్ రైజర్స్ ఈ అడ్డంకిని అధిగమిస్తుందా? లేదా? అన్న సందేహం చాలామందికి కలుగుతోంది. అన్ని అడ్డంకుల్ని అధిగమించి టైటిల్ సాధిస్తామని సన్ కెప్టన్ వైట్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.