: ముంబైలో అబార్షన్లు ఎక్కువే
ముంబైలో ఏటేటా అబార్షన్లు పెరిగిపోతున్నాయి. 2011లో ఇక్కడ 19,701 అబార్షన్లు జరగ్గా(రికార్డులలోకి ఎక్కిన సంఖ్య మాత్రమే), 2012లో 28,455 జరిగాయని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. అయితే, లింగ నిర్ధారణ పరీక్షల వల్ల అబార్షన్ల సంఖ్య పెరగడం లేదని బీఎంసీ వైద్యులు అంటున్నారు. వీటిలో ఎక్కువ శాతం మూడు నెలల గర్భం అప్పుడు లోపల పిండం లింగాన్ని గుర్తించడానికి వీలుకాక చేసినవేనని పేర్కొంటున్నారు. వీటిలో అవాంచిత గర్భస్రావాలు కూడా ఉండి ఉంటాయని కొందరు అంటున్నారు.