: కాఫీ తాగితే కాలేయం సేఫ్‌


కుదిరితే కప్పు కాఫీని చక్కగా లాగించేయడం వల్ల కాలేయం భద్రంగా ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. నిజానికి కాఫీ తాగడం అంత మంచిది కాదనేది చాలామంది అభిప్రాయం. కానీ ఇది తప్పని కొద్దిగా కాఫీ తాగడం వల్ల మన కాలేయాన్ని వివిధ వ్యాధుల బారినుండి రక్షించుకోవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఫ్లోరిడాలోని డైజెస్టివ్‌ డిసీస్‌ వీక్‌ 2013 లో ఈ తాజా అధ్యయనానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా తాము జరిపిన అధ్యయనంలో కాఫీ తాగడం వల్ల కాలేయం పనితీరు పూర్తిగా విఫలం కావడానికి కారణమైన ప్రైమరీ స్కెల్రోసింగ్‌ కొలాంగిటీస్‌ (పీఎస్సీ) వ్యాధి వచ్చే అవకాశాలు తగ్గినట్టుగా గుర్తించినట్టు తెలిపారు. ఈ విషయం గురించి ఈ అధ్యయనానికి నేతృత్వం వహిస్తున్న కినిక్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ వైద్య నిపుణులు క్రైగ్‌ లామెర్ట్‌ పీఎస్సీ వ్యాధికి గురైన వారు తక్కువగా కాఫీ తాగినట్టు తమ అధ్యయనంలో తేలిందని, కాఫీ తాగడం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశాలు తగ్గుతాయని అంటున్నారు. కాబట్టి చక్కగా ఉదయాన్నే కాస్త కాఫీ తాగేసి... హ్యాపీగా కాలేయాన్ని కాపాడుకుందాం...!

  • Loading...

More Telugu News