Dog: ఎంత 'ఇస్మార్ట్ శునకం'... వీడియో చూసి మీరే తేల్చండి!

  • స్లీఘ్ రైడ్ చేసిన కుక్క
  • వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి
  • వైరల్ అవుతున్న వీడియో

శునకాలకు ఎంతో తెలివి వుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇది మాత్రం మిగతా వాటిలాంటిది కాదు. మరింత 'ఇస్మార్ట్'... అందుకే ఇది ప్రత్యేకంగా నిలిచింది. ఇంతకీ ఈ కుక్క ఏం చేసిందంటారా? దట్టంగా మంచు కురవగా, ఆ మంచుపై స్లీఘ్ రైడ్ చేసింది. అది కూడా రైడ్ చేసేందుకు ఉపయోగించే ఓ ప్లాస్టిక్ ట్రేను తెచ్చుకుని మరీ దానిపై ఎక్కి కూర్చుని దర్జాగా, జారుతూ ఎగువ నుంచి దిగువకు వెళ్లింది.

దీన్ని వీడియో తీసిన అక్కీ అనే యూజర్, తాను ఈ రోజు చూసిన గొప్ప విషయం ఇదేనంటూ షేర్ చేశాడు. దీనికి 50 లక్షలకు పైగా వ్యూస్ రాగా, ఇది చాలా తెలివైన శునకమని నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు. ఆ వీడియోను మీరూ చూడండి. ఈ శునకం 'ఇస్మార్ట్ శునకం' అవునో కాదో చెప్పండి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News