: జగన్ అక్రమాల్లో కొండ్రుకూ భాగం: టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్
పాదయాత్ర రికార్డుల కోసమేనంటూ చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించిన మంత్రి కొండ్రు మురళిపై టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ విరుచుకు పడ్డారు. జగన్ అక్రమాల్లో కొండ్రు మురళికీ భాగం ఉందని ఆరోపించారు. అందుకే ఆయన పైనా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
చేతిలో అధికారం ఉంది కదా అని కొండ్రు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని రాజేంద్రప్రసాద్ విమర్శించారు. చంద్రబాబు పాదయాత్ర తల్లి, పిల్ల కాంగ్రెస్ రెండింటికి చరమ గీతం పాడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇక మద్యం మాఫియా నాయకుడ్నిమీ అధ్యక్షుడిగా తొలగించండంటూ కొండ్రుకు చురకలంటించారు.