Telugudesam: ఇలా ప్రజల్లో విశ్వసనీయత పోగొట్టుకున్నారంటే సిగ్గుచేటు!: జగన్ పై చంద్రబాబు విమర్శలు
- స్వార్థప్రయోజనాలు పొందాలన్నదే జగన్ నైజం
- జగన్ బూటకపు మాటలు నమ్మి మోసపోవద్దు
- ఈ విషయాన్ని ప్రజలకు రైతులు చెబుతున్నారు
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి విమర్శలు చేశారు. ప్రాంతాల మధ్య, సామాజిక వర్గాల మధ్య చీలిక తెచ్చి స్వార్థప్రయోజనాలు పొందాలన్నదే జగన్ నైజం అని రాజధాని రైతులు భావిస్తున్నారని అన్నారు. జగన్ బూటకపు మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు అమరావతి రైతులు చెబుతున్నారంటూ చంద్రబాబు వరుస ట్వీట్లు చేశారు. ఒక రాజకీయనాయకుడు ఇలా ప్రజల్లో విశ్వసనీయత పోగొట్టుకున్నారంటే అది సిగ్గుచేటంటూ జగన్ పై బాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.