Chandrababu: లండన్, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లోనూ సంఘీభావ ర్యాలీలు: చంద్రబాబు

  • 'రాజధాని'  ఏ కొందరి సమస్యో, ఒక ప్రాంతం సమస్యో కాదు
  • మూడు ముక్కలాట మొత్తం రాష్ట్రాన్నే అతలాకుతలం చేస్తుంది 
  • ఇప్పటికే వచ్చిన పెట్టుబడులు వెనక్కి పోయాయి
  • కంపెనీలన్నీ వేరే రాష్ట్రాలకు పోయాయి

అమరావతి పరిరక్షణ సమితికి ప్రవాసాంధ్రులు మద్దతు తెలుపుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వారు విరాళాలు సేకరించి తనకు అందజేశారని చెప్పారు. 'అమెరికాలోని న్యూజెర్సీ ప్రవాసాంధ్రుల ప్రతినిధులు నన్ను కలిసి, అమరావతి పరిరక్షణ సమితి తరఫున సేకరించిన ఎన్నారైల విరాళం రూ.7,76,022 చెక్కును అందజేశారు. రాజధానికి భూములిచ్చిన రైతులు, మహిళలు, రైతుకూలీలు, కార్మికులకు సంఘీభావంగా ప్రవాసాంధ్రులు కూడా ముందుకు రావడం ముదావహం' అని ట్వీట్ చేశారు
 
'అంతేకాదు లండన్, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్ తదితర గల్ఫ్ దేశాల్లో కూడా ఎన్నారైలు రాజధాని రైతులకు సంఘీభావ ర్యాలీలు జరపడం అభినందనీయం. ఎందుకంటే ఇది ఏ కొందరి సమస్యో, ఒక ప్రాంతం సమస్యో కాదు. వైసీపీ ఆడుతున్న ఈ మూడు ముక్కలాట మొత్తం రాష్ట్రాన్నే అతలాకుతలం చేస్తుంది' అని చెప్పారు.
 
'ఇప్పటికే వచ్చిన పెట్టుబడులు వెనక్కి పోయాయి. కంపెనీలన్నీ వేరే రాష్ట్రాలకు పోయాయి. కొత్త పెట్టుబడులు ఆగిపోయి, ఉపాధి కల్పనకు అడ్డుగోడ కట్టినట్టయ్యింది. తెదేపా చేసిన అభివృద్ధి అంతటినీ రివర్స్ చేశారు. ఈ పరిస్థితుల్లో రాజధాని అమరావతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత' అని చంద్రబాబు అన్నారు.

  • Loading...

More Telugu News