: మహారాష్ట్ర, కేరళ సీఎంలను పిలవాలన్న శ్రీశాంత్
ఐపీఎల్-6లో అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికిపోయిన కేరళ క్రికెటర్ శ్రీశాంత్ అరెస్టు వేళ ఎలా ప్రవర్తించాడో పోలీసు వర్గాలు వెల్లడించాయి. స్పాట్ ఫిక్సింగ్ లో శ్రీశాంత్ పాత్ర ఉందని నిర్ధారించుకున్న ఢిల్లీ పోలీసులు అతన్ని ముంబయిలో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. పోలీసులు ముంబయి వెళ్ళగా.. ఈ కేరళ ఎక్స్ ప్రెస్ బౌలర్ హోటల్ గదిలో లేడట. ఓ ఖరీదైన ఎస్ యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్) లో రోడ్లపై షికారుకు వెళ్ళాడు. దీంతో, అతన్ని చేజ్ చేసిన పోలీసులు ఎట్టకేలకు నిలువరించగలిగారు.
అరెస్టు చేస్తున్నామని చెప్పడంతో వెంటనే కారు దిగిన శ్రీశాంత్.. సెల్ ఫోన్ ను పోలీసులపైకి విసిరేసి మహారాష్ట్ర, కేరళ ముఖ్యమంత్రులకు కాల్ చేయమని చెప్పాడట. చాలా సేపటి వరకు అలానే ప్రవర్తించాడని, ఎప్పుడైతే, తామప్పటికే అదుపులోకి తీసుకున్న బుకీలను చూశాడో అప్పుడు కాస్త నెమ్మదించాడని వారు తెలిపారు.