: పేదలెవరూ ఆకలితో అలమటించకూడదనే..: రాహుల్ గాంధీ


విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఆహార భద్రత బిల్లు కోసం యూపీఏ ప్రభుత్వం ఎందుకు తహతహలాడుతుందో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వివరించారు. దేశంలో పేదలెవరూ ఆకలితో నిద్రించరాదనే తాము ఈ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని తెలిపారు. ఈ పథకం ప్రధాన ఉద్ధేశం అదేనని చెప్పారీ కాంగ్రెస్ యువరాజు. పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ తిరువనంతపురం విచ్చేశారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, కేరళ పీసీసీ అధ్యక్షుడు రమేశ్ చెన్నితాల చేపట్టిన కేరళ యాత్ర సత్ఫలితాలను ఇచ్చిందని అభిప్రాయపడ్డారు. ప్రజలతో మరింత మమేకం అయ్యేందుకు ఈ యాత్ర ఇతోధికంగా దోహదపడిందని రాహుల్ చెప్పారు.

  • Loading...

More Telugu News