నేను జగన్ ను గట్టిగా కోరుతున్నది ఇదే: రోజా
- మండలిని రద్దు చేయాల్సిందే
- అభివృద్ధిని అడ్డుకునే సభ ఎందుకు
- బినామీల భూముల కోసమే చంద్రబాబు ఉద్యమం
- వైసీపీ ఎమ్మెల్యే రోజా నిప్పులు
ఓ రాయలసీమ నుంచి వచ్చిన ఎమ్మెల్యేగా చంద్రబాబు, ఆ ప్రాంతాన్ని సర్వనాశనం చేశారని, ఇప్పుడా ప్రాంతాన్ని అభివృద్ది చేసేందుకు న్యాయ రాజధానిని పెడతామని చెబుతుంటే, అపహాస్యం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, ఆయన బినామీలు అమరావతిలో కొన్న భూములను కాపాడుకునేందుకే ఉద్యమాన్ని లేవదీశారని అన్నారు. మరోపక్క, గత ఆరు నెలల కాలంలోనే తాను ఇచ్చిన 80 శాతం హామీలను జగన్ నెరవేర్చారని రోజా వ్యాఖ్యానించారు.