మండలిని రద్దు చేస్తే మరో తుగ్లక్ నిర్ణయం అవుతుంది: నారా లోకేశ్
- మండలి రద్దు అంశంపై లోకేశ్ స్పందన
- సీఎం తప్పుల మీద తప్పులు చేస్తున్నారని విమర్శలు
- మండలిని ఎందుకు రద్దు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్
మండలిని రద్దు చేస్తే మరో తుగ్లక్ నిర్ణయం అవుతుందని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారని విమర్శించారు. మండలిని ఎందుకు రద్దు చేస్తున్నారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. తన వైఫల్యాలకు మంత్రులను బలిచేసే పని సీఎం ఇప్పటికే మొదలుపెట్టాడని ఆరోపించారు. దావోస్ సదస్సుకు రమ్మని రాష్ట్రానికి ఆహ్వానం లేదని, ఏపీకి వచ్చే పెట్టుబడులను తెలంగాణ తన్నుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.