: టైటిల్ ముంగిట బోర్లాపడ్డ విశ్వనాథన్ ఆనంద్


ప్రపంచ చెస్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ కు అనూహ్య పరాజయం ఎదురైంది. నార్వే సూపర్ చెస్ టోర్నీలో చివరి రౌండ్ గెలిస్తే టైటిల్ వశమవుతుందన్న నేపథ్యంలో విషీ.. చైనా క్రీడాకారుడు వాంగ్ హావో చేతిలో చిత్తయ్యాడు. ఈ ఓటమితో టోర్నీలో ఆనంద్ నాలుగోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 9 రౌండ్లు ముగిసిన అనంతరం ఆనంద్ (5).. పీటర్ స్విడ్లర్ (5), లెవోన్ అరోనియన్(5) లతో సంయుక్తంగా నాలుగోస్థానంలో నిలిచాడు. కాగా, టైటిల్ ను రష్యాకు చెందిన సెర్గీ కర్జాకిన్ (6) నెగ్గాడు. ప్రాథమిక రౌండ్లలో కర్జాకిన్, మాగ్నస్ కార్ల్ సన్ చేతిలో ఓటములు చవిచూడడం ఆనంద్ కు ప్రతికూలంగా మారింది.

  • Loading...

More Telugu News