: చాకో వ్యాఖ్యలపై హరీశ్ రావు స్పందన


తెలంగాణ అంశంపై కాంగ్రస్ నేత పీసీ చాకో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేత హరీశ్ రావు మండిపడ్డారు. యూపీఏ అజెండాలో తెలంగాణ లేదని చాకో స్పష్టం చేసిన తర్వాత కూడా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పార్టీలో ఎందుకుండాలో ఆలోచించుకోవాలని సూచించారు. డెడ్ లైన్ లు విధించడం మానుకొని ఉద్యమం కోసం చేతులు కలపాలని ఆయన కాంగ్రెస్ ఎంపీలకు సలహా ఇచ్చారు. హరీశ్ రావు ఈ మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ అజెండాలో ప్రత్యేక తెలంగాణ లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎందుకని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News