: అవసరమైతే కాంగ్రెస్ కు గుడ్ బై: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు
తెలంగాణ అంశం యూపీఏ అజెండాలో లేదంటూ ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మండిపడ్డారు. చాకో తన వ్యాఖ్యలతో తెలంగాణ ప్రజలను అవమానించారని, ఆయన తక్షణం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఎంపీలు ఈ రోజు హైదరాబాద్ లోని ఎంపీ వివేక్ నివాసంలో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 30 లోపు తెలంగాణపై పార్టీ స్పష్టమైన వైఖరి ప్రకటించకుంటే కాంగ్రెస్ ను వీడతామని హెచ్చరించారు.