rk: అందుకే పోలీసులు నన్ను అరెస్టు చేశారు: వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
- చట్టం ముందు అందరూ సమానమే
- చంద్రబాబు ఇప్పటికీ తానే సీఎం అనుకుంటున్నారు
- రియల్ ఎస్టేట్ వ్యాపారులు, టీడీపీ కార్యకర్తలతో ధర్నాలు చేయిస్తున్నారు
చట్టం ముందు అందరూ సమానమేనని, ర్యాలీకి అనుమతి లేదు కాబట్టే పోలీసులు తనను అరెస్టు చేశారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి చెప్పుకొచ్చారు. రాజధానిపై అధికారిక ప్రకటన రాకముందే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, టీడీపీ కార్యకర్తలతో ధర్నాలు చేయిస్తున్నారని అన్నారు.
అసాంఘిక శక్తులతో ప్రజా ప్రతినిధులపై దాడులు చేయిస్తున్నారని ఆర్కే ఆరోపణలు చేశారు. జోలె పట్టుకొని తిరగడానికి చంద్రబాబుకు సిగ్గు లేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇప్పటికీ తానే ముఖ్యమంత్రినని అనుకుంటున్నారని చెప్పారు. 144, 30 సెక్షన్లు అమల్లో ఉన్నప్పటికీ చంద్రబాబు పట్టించుకోవట్లేదని అన్నారు. పోలీసులను బెదిరించి శాంతి, భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆరోపించారు.