: ధర్మాన, సబితకు పదవీ వియోగం..!


జగన్ అక్రమాస్తుల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మంత్రులు ధర్మాన, సబిత ఇంద్రారెడ్డిని మంత్రి వర్గం నుంచి తప్పించడానికి ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆయన ధర్మానను తక్షణం తనను కలవాలంటూ సీఎం కబురు పెట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా మంత్రుల తొలగింపునకు అంగీకరించినందున.. రాజీనామా చేయాలంటూ వారిని ముఖ్యమంత్రి కోరనున్నారని పార్టీ వర్గాల సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని అధిష్ఠానం సీఎం కు సూచించింది. అయితే, అవినీతి అభియోగాలు ఎదుర్కొంటున్నందున వారిని తప్పించడం వల్ల నష్టమేమీ ఉండకపోవచ్చని సీఎం భావిస్తున్నారు. దీంతో ఇద్దరు మంత్రులు పదవీచ్యుతులు కానున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News