బీహార్ వసతి గృహాల్లో అత్యాచారాల కేసులో సీబీఐ కొత్త ట్విస్ట్
- ఆ 35 మంది బాలికలు చనిపోలేదని నివేదిక
- ఓ వసతి గృహం నుంచి ఇద్దరి అస్థిపంజరాలను సేకరించాం
- మైనర్ అమ్మాయిలకు సంబంధించిన ఆధారాలు దొరకలేదు
బీహార్‌లోని వసతి గృహాల్లో సుమారు 35 మంది బాలికలను అత్యాచారం చేసి చంపిన ఘటనపై సీబీఐ విచారణ పూర్తి చేసింది. మొత్తం 17 షెల్టర్ హోమ్స్‌పై విచారణ జరిపామని, నాలుగు కేసుల్లో 13 చార్జ్షీట్లు దాఖలు చేసినట్లు సీబీఐ నివేదికలో పేర్కొంది. ముజఫర్‌ఫూర్‌లోని ఓ వసతి గృహం నుంచి కేవలం ఇద్దరి అస్థిపంజరాలను సేకరించామని తెలిపింది. మైనర్ అమ్మాయిలకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు లభించలేదని సీబీఐ వెల్లడించింది. ఈ నేపథ్యంలో సీబీఐ తరపున వాదిస్తున్న అటార్నీ జనరల్ కెకె. వేణుగోపాల్.. చనిపోయినట్లు భావించిన బాలికలు బ్రతికే ఉన్నారని తెలిపారు.