: నిందితుడికి పెట్రోల్, యాసిడ్ ఇంజెక్షన్


ఉత్తరప్రదేశ్ లోని ఎతా జిల్లా పోలీసులు 'పోలీస్ మార్కు శిక్ష' ఎలా ఉంటుందో చూపించారు. 30 మందినిపైగా హతమార్చినట్లు అనుమానిస్తున్న నిందితుడు బల్బీర్... ఎతా జిల్లాలోని అవాగఢ్ పోలీసులకు దొరికిపోయాడు. ఇంకేముంది చితక్కొట్టారు. యాసిడ్, పెట్రోల్ ను ఇంజెక్షన్ సాయంతో అతడి శరీరంలోకి ఎక్కించారు. విషమ పరిస్థితుల్లో ఉన్న అతడిని చివరికి ఆస్పత్రిలో చేర్పించగా అక్కడ బల్బీర్ ప్రాణం విడిచాడు. పోలీసులు తీవ్రంగా హింసించడం వల్లే బల్బీర్ ప్రాణం కోల్పోయాడంటూ అతడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో అవాగఢ్ పోలీసులు ముగ్గురిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

  • Loading...

More Telugu News