ఎస్సైను కారుతో ఢీ కొట్టిన యువకులు... తీవ్రగాయాలు
- వికారాబాద్ లోని నవాబ్ పేట్ ఎస్సై కృష్ణకు హైదరాబాద్ లో చికిత్స
- అనంతగిరిలో వాహనాలు తనిఖీ చేస్తోన్న సమయంలో ఘటన
- నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
నిందితులు టోలీచౌక్ కు చెందిన ఇమ్రాన్, అన్వర్, నవీద్, సమీర్ గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. కృష్ణ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఆయన అందిస్తోన్న సేవలను అభినందిస్తున్నానని అన్నారు.