బంగ్లాదేశ్ లో మహిళల బాడీ బిల్డింగ్ పోటీలు.. ఇవెక్కడి పోటీలంటూ విస్తుపోతున్న జనం!
- ముస్లిం దేశం కావడంతో నిర్వాహకుల అతి జాగ్రత్తలు
- కండలను పూర్తిగా కప్పి ఉంచే దుస్తులతో బరిలోకి పోటీదారులు
- చాంపియన్గా నిలిచిన 19 ఏళ్ల విద్యార్థిని
ఈ పోటీల్లో పాల్గొన్న మహిళలు కండలను పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను ధరించి పాల్గొనడంతో ప్రేక్షకులు నిర్వెరపోయారు. కండలు బయటకు ప్రదర్శించకుండా విజేతలను ఎలా ఎంపిక చేస్తారో తెలియక బుర్రలు బద్దలుగొట్టుకున్నారు. ఈ పోటీల్లో 19 ఏళ్ల విద్యార్థిని అహోనా రహమాన్ బంగ్లాదేశ్ తొలి తొలి మహిళా చాంపియన్గా అవతరించింది.