: పెట్రో వడ్డనకు రంగం సిద్ధం
ప్రజలపై మరోసారి పెట్రో వడ్డన వేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. పోయిన నెల 17వ తేదీన పెట్రో ధరలను సవరించిన కేంద్ర చమురు శాఖ మళ్ళీ వీటిపై దృష్టి పెట్టింది. అదీ ఈ వారంలోనే పెంచేందుకు అవకాశం ఉన్నట్లుగా కేంద్ర వర్గాల సమాచారం.
ఈ క్రమంలో పెట్రోలు ధర లీటరుకు ఒక రూపాయి, డీజిల్ రేటును లీటరుకు 50 పైసలు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. పెట్రో, డీజిల్ ధరలు ప్రతినెల 50 పైసలు పెరుగుతుంటాయని గత నెల ధరలు పెంచిన సమయంలో చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ చెప్పిన సంగతి మనకు తెలిసిందే!