: నేడే చైనా ప్రధాని రాక


మూడు రోజుల పర్యటన కోసం చైనా నూతన ప్రధాని లీ కెకియాంగ్ నేడు భారత్ కు రానున్నారు. లీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి విదేశీ పర్యటన భారతే కావడం విశేషం. ప్రధాని మన్మోహన్ తో లీ సమావేశం అవుతారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లోకి చొచ్చుకు వచ్చిన చైనా బలగాల అంశం వీరి మధ్య ప్రధానంగా చర్చకు రానుంది. ఈ విషయమై ప్రధాని మన్మోహన్ భారత ఆందోళనను వ్యక్తం చేయనున్నారు. దీనితోపాటు ద్వైపాక్షిక వాణిజ్యం, రక్షణ మరికొన్ని అంశాలపై కూడా చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News